UP government: యూపీ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ పంజాబ్ ట్విట్టర్ ఖాతాలపై హ్యాకర్ల దాడి

UP government Punjab Congress Twitter accounts hacked in latest breach
  • అర్థం కాని వరుస పోస్ట్ లు
  • యూపీ ప్రభుత్వ ఖాతా పునరుద్ధరణ
  • ఇంకా పనిచేయని కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ హ్యాండిల్
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ పంజాబ్ రాష్ట్ర అధికారిక ట్విట్టర్ ఖాతాలపై హ్యాకర్లు విరుచుకుపడ్డారు. సోమవారం ఉదయం ఖాతాలు హ్యాక్ కు గురైన విషయం వెలుగు చూసింది. యూపీ ప్రభుత్వం ట్విట్టర్ ఖాతాను వెంటనే పునరుద్ధరించారు. కాంగ్రెస్ పార్టీ (పంజాబ్) ట్విట్టర్ హ్యాండిల్ ను ఇంకా పునరుద్ధరించలేదు. పేజీ డజ్ నాట్ ఎగ్జిస్ట్ అంటూ సందేశం కనిపిస్తోంది. హ్యాకర్లు ఈ ఖాతాలను తమ అదుపులోకి తీసుకుని వరుసగా పలు పోస్ట్ లు పెట్టారు.

జిఫ్ ఇమేజ్ పోస్ట్ చేశారు. ‘‘బీంజ్ అధికారిక కలెక్షన్ ను విడుదల చేసిన సందర్భంగా ఎన్ఎఫ్టీ ట్రేడర్లు అందరికీ ఎయిర్ డ్రాప్ ను వచ్చే 24 గంటల పాటు తెరిచి ఉంచుతున్నాం. మీ బీంజ్ ను క్లెయిమ్ చేసుకోండి’’ అంటూ యూపీ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ ఖాతాల్లో పోెస్ట్ చేశారు. యూపీ ప్రభుత్వం అధికారిక ఖాతాను 27 లక్షల మంది అనుసరిస్తుంటే, కాంగ్రెస్ పార్టీకి 27 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.
UP government
Punjab Congress
Twitter
hacked

More Telugu News