సోదరి మరణవార్త విన్నా.. గెలుపుకోసం పోరాడి వెళ్లిన హర్షల్ పటేల్
- ముంబై-ఆర్సీబీ మ్యాచ్ సందర్భంగా సోదరి మరణించినట్టు సమాాచారం
- ఆట ముగిసే వరకు కొనసాగిన పటేల్
- అనంతరం బయో బబుల్ నుంచి బయటకు
- తదుపరి మ్యాచ్ కు తిరిగి అందుబాటులోకి
మ్యాచ్ తర్వాత బయో బబుల్ నుంచి బయటకు వచ్చి ఇంటికి వెళ్లిపోయాడు. గత కొన్ని సీజన్ల నుంచి ఆర్సీబీకి హర్షల్ పటేల్ కీలకంగా వ్యవహరిస్తున్నాడు. ఈ నెల 12న సీఎస్కేతో ఆర్సీబీ తలపడనుంది. ఆ మ్యాచ్ కు పటేల్ తిరిగి అందుబాటులోకి వస్తాడని ఐపీఎల్ వర్గాలు వెల్లడించాయి. ఆర్సీబీ ఇప్పటి వరకు నాలుగు మ్యాచులు ఆడగా మూడింటిలో గెలిచి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది.