3 రోజులుగా కనపడకుండాపోయిన లాయర్.. కర్నూలు పట్టణ శివారులో మృతదేహం లభ్యం
- అనుమానాస్పద స్థితిలో మృతి
- 3 రోజుల క్రితం తన తమ్ముడి వద్దకు వెళ్లిన వెంకటేశ్వర్లు
- అక్కడి నుంచి తిరిగి వచ్చే సమయంలో హత్య?
అయితే, అప్పటి నుంచి ఆయన కనపడలేదు. మూడు రోజులుగా ఆయన కోసం కుటుంబ సభ్యులు వెతుకుతున్నారు. కర్నూలు శివారులో మృతదేహం ఉందని పోలీసులకు సమాచారం అందడంతో దీనిపై విచారణ ప్రారంభమైంది. వెంకటేశ్వర్లును దుండగులు హత్య చేసి రోడ్డు పక్కన పడేసి ఉండొచ్చని ఆయన కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.