Vijayasai Reddy: మ‌హేశ్ బాబుపై విజ‌య‌సాయిరెడ్డి ప్ర‌శంస‌ల వ‌ర్షం

వైసీపీ పార్ల‌మెంట‌రీ పార్టీ నేత వేణుంబాక విజ‌య‌సాయిరెడ్డి.. టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబుపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. ఈ మేర‌కు కాసేప‌టి క్రితం త‌న ట్విట్ట‌ర్ వేదిక‌పై మ‌హేశ్ బాబును అభినందిస్తూ ఓ ట్వీట్‌ను పోస్ట్ చేశారు. మ‌హేశ్ బాబును రియ‌ల్ హీరోగా కీర్తిస్తూ స‌ద‌రు పోస్ట్‌లో సాయిరెడ్డి పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపించారు.

వ‌రల్డ్ హెల్త్‌డేను పుర‌స్క‌రించుకుని మ‌హేశ్ బాబు 30 మంది చిన్నారుల‌కు గుండె శ‌స్త్రచికిత్స‌లు చేయించేందుకు ముందుకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఇదే విష‌యాన్ని ప్ర‌స్తావించిన సాయిరెడ్డి.. మ‌హేశ్ బాబు ద‌యాగుణం క‌లిగిన వార‌ని కీర్తించారు. ప్ర‌జ‌ల మెరుగైన జీవితాల కోసం రియ‌ల్ హీరోలు ఎలాంటి స్వార్థం లేకుండా ప‌నిచేస్తారంటూ మ‌హేశ్ బాబును సాయిరెడ్డి కొనియాడారు. 
Vijayasai Reddy
Mahesh Babu
WorldHealthDay
YSRCP

More Telugu News