'ఆచార్య' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆ రోజునే!
- 'ఆచార్య'గా చిరంజీవి
- మరో ప్రధానమైన పాత్రలో చరణ్
- సంగీత దర్శకుడిగా మణిశర్మ
- ఈ నెల 29వ తేదీన విడుదల
ఈ సినిమాను ఈ నెల 29వ తేదీన భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించిన ఆసక్తి అందరిలో నెలకొంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ నెల 24వ తేదీన జరపనున్నట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్ .. యూసఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ లో ఈ వేడుకను ప్లాన్ చేస్తున్నట్టుగా చెబుతున్నారు.
దాదాపు ఈ తేదీ ఖరారైపోయిందనీ, త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుందని అంటున్నారు. మణిశర్మ నుంచి బయటికి వచ్చిన పాటలు ఇప్పటికే పాప్యులర్ అయ్యాయి. సంగీత .. అనసూయ ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి, రెజీనా స్పెషల్ సాంగ్ హైలైట్ గా నిలవడం ఖాయమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.