Sajjala Ramakrishna Reddy: సీఎం జ‌గ‌న్‌తో స‌జ్జ‌ల భేటీ.. కేబినెట్ కూర్పుపై చ‌ర్చ‌

sajjala meeting with ys jagan
షార్ట్స్‌లో చూడండి
ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితో వైసీపీ కీల‌క నేత‌, ఏపీ ప్ర‌భుత్వ ముఖ్య స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి భేటీ అయ్యారు. తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో కాసేప‌టి క్రితం మొద‌లైన ఈ భేటీలో కేబినెట్ కూర్పుపై జ‌గ‌న్‌తో స‌జ్జ‌ల చ‌ర్చిస్తున్న‌ట్లు స‌మాచారం.

గురువారం నాడు త‌న కేబినెట్‌లోని మొత్తం 24 మంది మంత్రుల‌తో రాజీనామాలు తీసుకున్న జ‌గ‌న్‌.. ఈ నెల 11న కొత్త కేబినెట్‌తో ప్ర‌మాణం చేయించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్త‌గా మంత్రివ‌ర్గంలోకి ఎవ‌రెవ‌రిని తీసుకోవాలి?  రాజీనామాలు చేసిన మంత్రుల్లో ఎవ‌రెవ‌రిని తిరిగి కేబినెట్‌లోకి తీసుకోవాలి అన్న విష‌యాల‌పై జ‌గ‌న్‌తో స‌జ్జ‌ల చ‌ర్చిస్తున్న‌ట్లు స‌మాచారం.
Go Back to Shorts
Sajjala Ramakrishna Reddy
YS Jagan
AP Cabinet

More Telugu News