మానవ హక్కుల మండలి నుంచి రష్యా అవుట్.. ఐరాస ఓటింగ్‌కు దూరంగా భారత్
- ఐరాస జనరల్ అసెంబ్లీలో జరిగిన ఓటింగ్
- తీర్మానానికి అనుకూలంగా 93 దేశాల ఓటు
- వ్యతిరేకంగా 24 దేశాల ఓటు
- ఓటింగ్‌కు దూరంగా భారత్ సహా 58 దేశాలు
అయితే, ఈ ఓటింగ్‌కు భారత్ దూరంగా ఉండిపోయింది. ఈ ఓటింగ్‌లో పాల్గొనకుండా భారత్ తన తటస్థ వైఖరిని అవలంబించింది. రష్యాను మానవ హక్కుల మండలి నుంచి బహిష్కరించాలన్న తీర్మానంపై ఐరాస జనరల్ అసెంబ్లీలో జరిగిన ఓటింగ్‌లో అనుకూలంగా 93 దేశాలు ఓటేశాయి. ఈ తీర్మానానికి వ్యతిరేకంగా 24 దేశాలు ఓటేయగా... భారత్ సహా 58 దేశాలు ఈ ఓటింగ్‌లో పాలుపంచుకోలేదు.