ఏపీ మంత్రుల రాజీనామా.. సీఎం జగన్కు లేఖల అందజేత
- ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ
- మంత్రులంతా రాజీనామాలు చేసిన వైనం
- రాజీనామా లేఖలు జగన్కు అందజేసిన మంత్రులు
- గవర్నర్కు రాజీనామాలను పంపనున్న జగన్
గురువారం మధ్యాహ్నం ప్రారంభమైన కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించిన అనంతరం మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై చర్చ జరగ్గా.. జగన్ ఆదేశాల మేరకు మంత్రులంతా అక్కడికక్కడే తమ రాజీనామాలను సమర్పించారు. మంత్రుల రాజీనామాల సమర్పణతో గురువారం నాటి కేబినెట్ భేటీ ముగిసింది.