గంటకు పైగా మోదీతో భేటీ.. జగన్ ఏమేం చర్చించారంటే..!
- మోదీతో ముగిసిన జగన్ భేటీ
- కొత్త జిల్లాల ఏర్పాటును వివరించిన జగన్
- తెలంగాణ బకాయిలపై కూడా జరిగిన చర్చ
ఈ భేటీలో జగన్ పలు కీలక అంశాలను మోదీ వద్ద ప్రస్తావించినట్లు సమాచారం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మోదీకి వివరించిన జగన్.. రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటును కూడా వివరించారు. పోలవరం ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితిని ప్రధానికి వివరించిన జగన్.. రాష్ట్రానికి సంబంధించిన పలు పెండింగ్ అంశాలపై కూడా చర్చించారు. రాష్ట్ర రెవెన్యూ లోటును మరోమారు ప్రస్తావించిన జగన్.. తెలంగాణ నుంచి రాష్ట్రానికి రావాల్సిన బకాయిల గురించి కూడా మోదీకి వివరించినట్లు సమాచారం.