డ్ర‌గ్స్ కేసులో ఎన్టీఆర్ కూతురి అల్లుడు.. ప‌రారీలో అర్జున్‌ వీర‌మాచ‌నేని

ntr daughters son in law in drugs case
  • బంజారా హిల్స్ ప‌రిధిలోని ప‌బ్‌పై పోలీసుల దాడి
  • ప‌లువురిపై కేసు న‌మోదు
  • ఏ3 నిందితుడిగా అర్జున్ వీర‌మాచ‌నేని
హైద‌రాబాద్‌లో క‌ల‌క‌లం రేపిన డ్ర‌గ్స్  కేసులో స‌మ‌యం గ‌డిచేకొద్దీ ప‌లు సంచ‌ల‌న విష‌యాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసులో ఏ3 నిందితుడిగా పోలీసులు న‌మోదు చేసిన అర్జున్ వీర‌మాచ‌నేని.. టీడీపీ వ్య‌వ‌స్థాప‌కుడు ఎన్టీఆర్ కూతురి అల్లుడిగా తేలింది.

ఆదివారం తెల్ల‌వారుజామున బంజారాహిల్స్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని ప‌బ్‌పై తెలంగాణ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసిన సంగ‌తి తెలిసిందే. ఆ స‌మ‌యంలో ప‌బ్‌లో ఉన్న 150 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వివ‌రాల‌ను న‌మోదు చేసుకుని వ‌దిలేశారు. 

అయితే ప‌బ్‌లో డ్ర‌గ్స్ బ‌య‌ట‌ప‌డిన నేప‌థ్యంలో స‌ద‌రు డ్ర‌గ్స్‌తో సంబంధం ఉంద‌ని భావించిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో ఇద్ద‌రిని ఇప్ప‌టికే రిమాండ్‌కు త‌ర‌లించ‌గా..ఏ3 నిందితుడిగా ఉన్న అర్జున్ వీర‌మాచ‌నేని గురించిన వివ‌రాలు తాజాగా వెల్ల‌డ‌య్యాయి. ప్ర‌స్తుతం ప‌రారీలో ఉన్న అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Go Back to Shorts
Drugs
Telangana Police
Arjun Veeramachaneni

More Telugu News