గంజాయికి బానిసైన కొడుకును కరెంటు స్తంభానికి కట్టేసి కొట్టిన తల్లి... వీడియో ఇదిగో!
- గంజాయి మత్తుకు అలవాటుపడిన 15 ఏళ్ల కుర్రాడు
- అనేక పర్యాయాలు నచ్చజెప్పిన తల్లి
- తీరు మార్చుకోని కుర్రాడు
- కళ్లలో కారం చల్లిన తల్లి
15 ఏళ్ల కుర్రాడు గంజాయి లేనిదే బతకలేని స్థితికి వచ్చాడు. కొడుకు మాదక ద్రవ్యాలకు బానిస కావడాన్ని ఆ తల్లి తట్టుకోలేకపోయింది. ఎన్నోసార్లు చెప్పినా వినకపోవడంతో అపర కాళిక అవతారం ఎత్తింది. కొడుకును ఓ కరెంటు స్తంభానికి కట్టేసి కళ్లలో కారం చల్లింది. దాంతో ఆ కుర్రాడు మంట మంట అంటూ గగ్గోలెత్తిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.