ముంబైలో రామ్ చరణ్ ను చుట్టుముట్టిన అభిమానులు.. వీడియో ఇదిగో!

Mumbai fans surrounded Ramcharan
  • 'ఆర్ఆర్ఆర్'తో నార్త్ లో చరణ్ కు పెరిగిన క్రేజ్
  • నిన్న సాయంత్రం బాంద్రాలో సినిమా చూసిన చరణ్
  • చరణ్ తో సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డ అభిమానులు
'ఆర్ఆర్ఆర్' సినిమాకు ముందే రామ్ చరణ్ 'జంజీర్' అనే హిందీ సినిమా చేశాడు. ఆ చిత్రంలో రామ్ చరణ్ సరసన ప్రియాంక చోప్రా నటించింది. అయితే ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఊహించినంత విజయం సాధించలేకపోయింది. ఇప్పుడు తాజాగా విడుదలైన 'ఆర్ఆర్ఆర్' చిత్రం హిందీలో సైతం దూసుకుపోతోంది. ఎన్టీఆర్, చరణ్ ల యాక్టింగ్ కు నార్త్ ప్రేక్షకులు కూడా బాగా కనెక్ట్ అయ్యారు. దీంతో, చరణ్ కు నార్త్ లో సైతం క్రేజ్ బాగా పెరిగిపోయింది. 

ఈ నేపథ్యంలో, 'ఆర్ఆర్ఆర్' సినిమాకు బాలీవుడ్ ప్రేక్షకుల రెస్పాన్స్ ఎలా ఉందో చూసేందుకు నిన్న సాయంత్రం ముంబై బాంద్రాలోని గెయిటీ గెలాక్సీకి చరణ్ వెళ్లాడు. అక్కడ చరణ్ ను చూసిన అభిమానులు చుట్టుముట్టారు. ఆయనతో సెల్ఫీలు, ఫొటోలు దిగేందుకు ఎగబడ్డారు. చరణ్ కూడా ఎంతో ఉత్సాహంగా వారితో కలిసిపోయాడు. ప్రేక్షకుల అభిమానానికి ఎంతో ఆనందించాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Go Back to Shorts
Ramcharan
RRR
Mumbai
Fans

More Telugu News