Nellore District: నెల్లూరులో యాపిల్ ధరలతో పోటీపడుతున్న నిమ్మకాయలు!

Lemon Rates compete to apple rates in nellore dist
షార్ట్స్‌లో చూడండి
వేసవి ఎండలు మండిపోతుండడంతో నిమ్మకాయలకు విపరీతమైన గిరాకీ ఏర్పడింది. దీంతో వాటి ధర ఇప్పుడు అమాంతం పెరిగిపోయింది. నెల్లూరు జిల్లా గూడూరు మార్కెట్‌లో నిన్న నిమ్మకాయలకు రికార్డు ధర పలికింది. మార్కెట్‌కు ఓ రైతు తెచ్చిన మొదటిరకం (ఆకుపచ్చ) నిమ్మకాయలను వ్యాపారులు కిలో రూ. 160 చొప్పున కొనుగోలు చేశారు.

రెండో రకం కాయలు రూ. 130-150 మధ్య పలుకుతుండగా, నిమ్మ పండ్లు రూ. 100-130 మధ్య ధర పలుకుతున్నాయి. గతేడాదితో పోలిస్తే వీటికి ఇప్పుడు రెట్టింపు ధర పలుకుతున్నట్టు రైతులు చెబుతున్నారు. ఇక, జిల్లాలో కిలో యాపిల్ పండ్లను రూ. 150-200 మధ్య విక్రయిస్తుండడం గమనార్హం.
Go Back to Shorts
Nellore District
Gudur
Lemon
Summer

More Telugu News