బీజేపీ వ్యతిరేక కూటమికి సారథ్యం వహించలేను: శరద్ పవార్ స్పష్టీకరణ
- యూపీఏ చైర్ పర్సన్ కావాలని కూడా అనుకోవడం లేదు
- బీజేపీ వ్యతిరేక కూటమిలో కాంగ్రెస్ పార్టీ అనివార్యం
- ఒకే పార్టీ బలంగా ఉంటే నాయకులు ‘పుతిన్’లా తయారవుతారు
కాంగ్రెస్ ఇప్పుడు అధికారంలో లేకపోవచ్చేమో కానీ, అది అఖిల భారత పార్టీ అని, దేశంలోని ప్రతి గ్రామంలోనూ ఆ పార్టీ కార్యకర్తలు ఉంటారని చెప్పుకొచ్చారు. కాబట్టి బీజేపీపై పోరులో కాంగ్రెస్ పార్టీ అనివార్యమని, దానిని విస్మరించలేమని అన్నారు. అలాగే, పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీలానే ఆయా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు కూడా బలమైనవేనని అన్నారు. దేశంలో ఒకే పార్టీ బలంగా ఉంటే నాయకులు పుతిన్‌లా మారే అవకాశం ఉందని, మన దేశానికి అలాంటి బెడద లేదనే తాను అనుకుంటున్నట్టు శరద్ పవార్ పేర్కొన్నారు.