తెలంగాణలో గత 24 గంటల్లో 12 మందికి కరోనా

Telangana corona updates
  • తాజాగా 10,348 కరోనా పరీక్షలు
  • హైదరాబాదులో 8 కొత్త కేసులు
  • కరోనా నుంచి కోలుకున్న 49 మంది
  • ఇంకా 290 మందికి చికిత్స
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 10,348 కరోనా పరీక్షలు నిర్వహించగా, 12 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. అత్యధికంగా హైదరాబాదులో 8 కొత్త కేసులు నమోదు కాగా, జోగులాంబ గద్వాల జిల్లాలో 1, ఆదిలాబాద్ జిల్లాలో 1, నాగర్ కర్నూలు జిల్లాలో 1, కామారెడ్డి జిల్లాలో 1 కేసు గుర్తించారు. అదే సమయంలో 49 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా ఎలాంటి మరణాలు సంభవించలేదు. 

రాష్ట్రంలో ఇప్పటివరకు 7,91,328 మంది కరోనా బారినపడగా, వారిలో 7,86,927 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 290 మంది చికిత్స పొందుతున్నారు. తెలంగాణలో ఇప్పటిదాకా కరోనాతో 4,111 మంది మరణించారు.
Go Back to Shorts
Telangana
Corona Virus
Daily Updates
Today Cases

More Telugu News