13 రోజుల్లో 11వ సారి పెట్రో ధరల పెంపు.. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోలు ధర ఎంతంటే?

Petrol price crossed Rs117 in Hyderabad
  • హైదరాబాద్‌లో పెట్రోలు ధర రూ.117.21, డీజిల్ ధర రూ. 103.03 
  • గుంటూరులో రూ.120కి చేరువగా పెట్రోలు ధర
  • గత 11 రోజుల్లో రూ. 8కిపైనే పెరిగిన ధర
దేశవ్యాప్తంగా పెట్రో ధరలు నేడు కూడా పెరిగాయి. పెట్రోలు, డీజిల్ ధరలు పెరగడం గత 13 రోజుల్లో ఇది 11వ సారి కావడం గమనార్హం. తాజాగా లీటరు పెట్రోలుపై 91 పైసలు, డీజిల్‌పై 87 పైసలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. తాజా ధరల పెంపుతో హైదరాబాద్‌లో లీటరు పెట్రోలు ధర రూ. 117.21కి చేరుకుంది. డీజిల్ ధర రూ. 103.03కి చేరుకుంది. 

ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో లీటరు పెట్రోలుపై 87 పైసలు, డీజిల్‌పై 84 పైసలు పెరిగింది. ఫలితంగా పెట్రోలు ధర రూ. 119.07, డీజిల్ ధర రూ. 104.78కి చేరుకుంది. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోలు, డీజిల్ ధరపై 80 పైసలు చొప్పున పెంచారు. కాగా, ఈ 11 రోజుల్లో పెట్రోలు, డీజిల్ ధరలు 8 రూపాయలకు పైనే పెరగడం గమనార్హం.
Go Back to Shorts
Petrol
Diesel
Hyderabad
Guntur

More Telugu News