పాతబస్తీలో ఐసిస్ సానుభూతిపరుడు.. అరెస్ట్ చేసిన పోలీసులు
- ఐసిస్‌కు అనుకూలంగా సులేమాన్ ప్రచారం
- ఐపీ అడ్రెస్ ఆధారంగా సులేమాన్ గుర్తింపు
- సులేమాన్ పేరుపై సోషల్ మీడియాలో 20 ఖాతాలు
- తీవ్రవాదం వైపు యువతను ఆకర్షించేలా పోస్టులు
ఐసిస్‌కు అనుకూలంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వైనంపై దృష్టి సారించిన పోలీసులు.. ఆ పోస్టుల ఐపీ అడ్రెస్ ఆధారంగా పాతబస్తీ నుంచే సులేమాన్ అనే వ్యక్తి సదరు పోస్టులను పోస్ట్ చేస్తున్నాడని పోలీసులు నిర్ధారించారు. ఆ వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సులేమాన్‌ను అరెస్ట్ చేశారు. విచారణ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా సులేమాన్ ఏకంగా 20 ఖాతాలను తెరచి యువతను ఉగ్రవాదం వైపు మళ్లేలా చేస్తున్నాడని పోలీసులు తేల్చారు.