యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో మొక్కులు చెల్లించుకున్న రోజా
- ఈ రోజు ఉదయం స్వామి వారిని దర్శించుకున్న రోజా
- ఆమె వెంట టీఆర్ఎస్ ఎమ్మెల్సీ సురభి వాణిదేవీ
- రోజాకు తీర్థప్రసాదాలు అందించిన ఆలయ అర్చకులు
కాగా, చాలా కాలం తర్వాత స్వయంభూ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు అవకాశం రావడంతో యాదాద్రిలో భక్తుల రద్దీ పెరిగింది. కల్యాణకట్ట, లక్ష్మీ పుష్కరిణి వద్ద కూడా భక్తులు భారీగా కనపడుతున్నారు. స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు.