'సూపర్ సేవర్ కార్డు' తీసుకువచ్చిన హైదరాబాద్ మెట్రో... వివరాలు ఇవిగో!
- మెట్రో ప్రయాణికులకు బంపర్ ఆఫర్
- పండుగ రోజుల్లో వర్తించే సూపర్ సేవర్ కార్డు
- ధర రూ.59.. రోజంతా ప్రయాణం చేసే చాన్స్
ఆయా సెలవు రోజుల్లో ఈ సూపర్ సేవర్ కార్డుతో హైదరాబాదు నగరంలో ఎక్కడ్నించి ఎక్కడికైనా ప్రయాణం చేయొచ్చు. మెట్రో సెలవు దినాల జాబితాలో ప్రతి ఆదివారం, ప్రతి 2వ శనివారం, ప్రతి 4వ శనివారంతో పాటు శివరాత్రి, ఉగాది, బోనాలు, రంజాన్, మొహరం, వినాయకచవితి, ఆగస్టు 15, దసరా, దీపావళి, డిసెంబరు 26 (బాక్సింగ్ డే), భోగి, సంక్రాంతి వంటి పర్వదినాల్లో ఈ సూపర్ సేవర్ కార్డు వర్తిస్తుందని ఎల్ అండ్ టీ మెట్రో ఎండీ కేవీబీ రెడ్డి వెల్లడించారు.