'రేసుగుర్రం' విలన్ రవికిషన్ ఇంట విషాదం
- రవికిషన్ సోదరుడు రమేశ్ మృతి
- డాక్టర్లు శ్రమించినా ఫలితం దక్కలేదన్న రవికిషన్
- సంతాపాన్ని ప్రకటించిన సీఎం యోగి
తన సోదరుడి ప్రాణాలను కాపాడేందుకు డాక్టర్లు ఎంతో శ్రమించినా ఫలితం లేకపోయిందని రవికిషన్ చెప్పారు. తన తండ్రి చనిపోయిన కొన్ని రోజులకే సోదరుడు కూడా మృతి చెందడం తమ కుటుంబాన్ని కలచివేస్తోందని తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. రవికిషన్ కు ముగ్గురు సోదరులు, ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. యూపీలోని గోరఖ్ పూర్ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎంపీగా రవికిషన్ గెలుపొందారు. మరోవైపు రమేశ్ మృతి పట్ల సీఎం యోగి ఆదిత్యనాథ్ సంతాపాన్ని తెలియజేశారు.