Alia Bhatt: రాజ‌మౌళిపై అలియా భట్ కోపంగా ఉంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోన్న వేళ.. 'ఆర్ఆర్ఆర్' గురించి హీరోయిన్ పోస్ట్

alia posts about rrr
షార్ట్స్‌లో చూడండి
హీరోయిన్ అలియా భట్ 'ఆర్ఆర్ఆర్' చిత్రంలో రామ్ చ‌ర‌ణ్‌కు జోడీగా సీత పాత్రలో న‌టించిన‌ సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమా విడులైన అనంత‌రం ద‌ర్శ‌కుడు రాజ‌మౌళిపై ఆమె కోపంతో ఉన్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి రాజమౌళిని అన్ ఫాలో చేసినట్లు, 'ఆర్ఆర్ఆర్' చిత్రానికి సంబంధించిన కొన్ని పోస్టులను డిలీట్ చేసిన‌ట్లు తెలిసింది. 

అయితే, ఆమె తాజాగా 'ఆర్ఆర్ఆర్' చిత్రం హిందీలో రూ.100 కోట్ల వ‌సూళ్ల‌ను దాటిన విష‌యాన్ని తెలుపుతూ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఓ పోస్ట్ చేయ‌డం ఆస‌క్తి రేపుతోంది. ఆమె నిజంగానే రాజ‌మౌళిపై ఆగ్ర‌హంతో ఉందా? లేక ఈ విష‌యంలో జ‌రిగిన ప్ర‌చారం ఒట్టి వదంతేనా? అన్న సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. 


            
Go Back to Shorts
Alia Bhatt
RRR
Rajamouli

More Telugu News