' టైగర్ నాగేశ్వరరావు' ప్రారంభానికి ముహూర్తం ఖరారు!

Tiger Nageshwara Rao Movie uIpdate
  • రిలీజ్ కి రెడీగా 'రామారావు ఆన్ డ్యూటీ'
  • సెట్స్ పై రెండు సినిమాలు  
  • వంశీకృష్ణకి గ్రీన్ సిగ్నల్ 
  • ఏప్రిల్ 2వ తేదీన పూజా కార్యక్రమాలు   
రవితేజ హీరోగా 'టైగర్ నాగేశ్వర రావు' సినిమా రూపొందనుందనే టాక్ కొన్ని రోజులుగా వినిపిస్తోంది. స్టూవర్టుపురం దొంగ టైగర్ నాగేశ్వరరావు జీవితచరిత్ర ఆధారంగా ఈ సినిమా నిర్మితమవుతుందని చెప్పారు. ఆ తరువాత అధికారిక ప్రకటన వచ్చింది. ఇక ఇప్పుడు ఈ సినిమా సెట్స్ పైకి వెళుతోంది.  

'ఉగాది' పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని ఏప్రిల్ 2వ తేదీ మధ్యాహ్నం 12:06 నిమిషాలకు ఈ సినిమాను లాంచ్ చేయనున్నారు. అదే సమయంలో ఈ సినిమా ప్రీ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాకి వంశీ కృష్ణ దర్శకత్వం వహించనున్నాడు. గతంలో ఆయన నుంచి మంచు లక్ష్మి 'దొంగాట' ..  'కిట్టు ఉన్నాడు జాగ్రత్త' సినిమాలు వచ్చాయి. 

అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ఈ సినిమాను, తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి. రవితేజ నుంచి 'రామారావు ఆన్ డ్యూటీ' రిలీజ్ కి రెడీగా ఉండగా, 'ధమాకా' .. 'రావణాసుర' సెట్స్ పై ఉన్నాయి.
Go Back to Shorts
Raviteja
Vamsi
Tiger Nageshwara Rao Movie

More Telugu News