ఢిల్లీలో రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ నిరసన.. పాల్గొన్న రేవంత్ రెడ్డి
- పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలపై ఆందోళన
- పది రోజుల్లో తొమ్మిది సార్లు పెంచారన్న రాహుల్
- దేశ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టామన్న ఖర్గే
దేశంలోని ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిసిన అనంతరం ఇంధన ధరలు పెరుగుతాయని తమ పార్టీ నేతలు ముందే చెప్పారని కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా తమ పార్టీ దేశ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టిందని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే అన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా పాల్గొన్నారు.