Neera Cafe: నీరా కేఫ్‌లో తెలంగాణ మంత్రి.. నీరా సేవిస్తూ ఫొటోల‌కు పోజు

minister srinivas goud inspects neera cafe works
  • నెక్లెస్ రోడ్‌లో శ‌ర‌వేగంగా సాగుతున్న‌ నీరా కేఫ్ ప‌నులు
  • ప‌నుల‌ను ప‌రిశీలించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్‌
  • కుల‌వృత్తుల‌ను అవ‌హేళ‌న చేస్తే క్ష‌మించేది లేద‌ని హెచ్చ‌రిక‌
తెలంగాణ ప‌ర్యాట‌క శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ బుధ‌వారం హైద‌రాబాద్‌లోని నెక్లెస్ రోడ్‌లో నిర్మాణం జ‌రుగుతున్న నీరా కేఫ్‌ను ప‌రిశీలించారు. కేఫ్ నిర్మాణ ప‌నుల‌ను ప‌రిశీలించిన మంత్రి త్వ‌రిత‌గ‌తిన ప‌నుల‌ను పూర్తి చేయాల‌ని అధికారుల‌కు ఆదేశాలు జారీ చేశారు. నీరా ఉత్ప‌త్తుల ద్వారా క‌లిగే ప్ర‌యోజ‌నాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రించ‌డంతో పాటు నీరా ఉత్ప‌త్తుల వినియోగాన్ని పెంచుతామ‌ని ఆయ‌న తెలిపారు. 

గీత కార్మికుల‌కు ప్రోత్సాహం ఇచ్చేలా నెక్లెస్ రోడ్‌లో రూ.25 కోట్ల‌తో నీరా కేఫ్‌ను ప్రారంభించ‌నున్నట్లు మంత్రి తెలిపారు. కుల‌వృత్తులు చేసుకునే వారిని అవ‌హేళ‌న చేస్తే ఏ పార్టీకి చెందిన వారినైనా ఉపేక్షించేది లేద‌ని ఆయ‌న హెచ్చ‌రించారు. ఈ సంద‌ర్భంగా అక్క‌డ త‌యారైన నీరా ఉత్ప‌త్తుల్లో ఓ పానీయాన్ని సేవిస్తూ మంత్రి ఫొటోల‌కు పోజిచ్చారు.
Neera Cafe
V Srinivas Goud
Telangana

More Telugu News