Janasena: గాయ‌ప‌డ్డ కార్య‌కర్త వైద్యానికి జ‌న‌సేన రూ.1 ల‌క్ష విరాళం

janasena gave 1 lack rupees to medical expenses of a party member
  • రోడ్డు ప్ర‌మాదంలో గాయ‌ప‌డ్డ జ‌న సైనికుడు
  • కుటుంబ ఆర్థిక ప‌రిస్థితిపై ఆరా తీసిన జ‌న‌సేన‌
  • వైద్య ఖ‌ర్చుల నిమిత్తం రూ.1 లక్ష అంద‌జేత‌
రోడ్డు ప్ర‌మాదంలో గాయ‌ప‌డ్డ త‌మ పార్టీ కార్య‌క‌ర్త వైద్య ఖర్చుల నిమిత్తం జనసేన పార్టీ రూ.1ల‌క్ష విరాళాన్ని ప్రకటించింది. గుంటూరు జిల్లా బాపట్ల నియోజకవర్గం కర్లపాలెం గ్రామానికి చెందిన జన సైనికుడు షేక్ ఖాదీర్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. 

అతని కుటుంబ ఆర్ధిక పరిస్థితి సరిగా లేనందున షేక్ ఖాదీర్ వైద్య ఖర్చుల నిమిత్తం జనసేన పార్టీ తరఫున రూ.1 లక్ష ఆర్ధిక సాయం అందించారు. ఈ మేర‌కు హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధ‌వారం జరిగిన ఒక కార్యక్రమంలో ఈ మొత్తాన్ని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ చెక్ రూపంలో ఖాదీర్ సోదరుడు ఖాజావలికి అందజేశారు.
Janasena
Pawan Kalyan
Nadendla Manohar

More Telugu News