Upasana: ఉపాస‌న‌కు నాట్‌హెల్త్ సీఎస్ఆర్ అవార్డు..ఉబ్బిత‌బ్బిబ్బ‌వుతున్న మెగా కోడ‌లు

upasana received the reputed  NATHEALTH CSR Award 2022
  • నాట్‌హెల్త్ సీఎస్ఆర్ 2022 అవార్డుకు ఉపాసన ఎంపిక‌
  • ఇటీవ‌లే అవార్డును అందుకున్న మెగా కోడలు 
  • సంతోషాన్ని వ్య‌క్తం చేస్తూ ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసిన వైనం
అపోలో హాస్పిట‌ల్స్ వ్య‌వ‌స్థాప‌కుడు ప్ర‌తాప్ సి. రెడ్డి మ‌న‌వ‌రాలు, టాలీవుడ్ మెగా ప‌వ‌ర్ స్టార్ రాంచ‌ర‌ణ్ తేజ్ భార్య ఉపాస‌న‌కు ప్రతిష్ఠాత్మ‌క నాట్‌హెల్త్ సీఎస్ఆర్ అవార్డు ద‌క్కింది. అపోలో హాస్పిట‌ల్స్ కేంద్రంగా త‌న వంతుగా కొన్ని ప్రాజెక్టుల‌పై ప‌నిచేస్తున్న ఉపాస‌న సంపూర్ణ ఆరోగ్యం పేరిట ప్ర‌యోగాలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

అపోలో ఫౌండేష‌న్ ఆధ్వ‌ర్యంలో జ‌రిగే కార్య‌క్ర‌మాల్లో చురుగ్గా పాలుపంచుకుంటున్న ఉపాస‌న‌.. సంపూర్ణ ఆరోగ్యం ప‌ట్ల అవగాహ‌న క‌ల్పిస్తూ ప‌లు వీడియోల‌ను కూడా విడుద‌ల చేస్తుంటారు. ఈ క్ర‌మంలోనే ఉపాస‌న రూపొందించిన ఓ ప్రాజెక్టును ప‌రిశీలించిన నాట్‌హెల్త్ సీఎస్ఆర్ ఆమెకు 2022కు సంబంధించిన అవార్డును ప్ర‌క‌టించింది. ఈ అవార్డును ఇటీవ‌లే అందుకున్న ఉసాస‌న ఉబ్బిత‌బ్బిబ్బైపోయారు. ఈ అవార్డుతో త‌మ తాత ప్ర‌తాప్ సి.రెడ్డి చెప్పే సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించే దిశ‌గా ప‌య‌నిస్తున్నామ‌న్న భావ‌న క‌లుగుతోంద‌ని ఉపాస‌న చెప్పారు.
Upasana
Appollo
Pratap C.Reddy
NATHEALTH CSR Award 2022

More Telugu News