చార్జింగ్ పెట్టి ఫోన్ మాట్లాడుతుండగా షాక్.. హైదరాబాద్‌లో యువకుడి మృతి
- రెండేళ్ల క్రితం హైదరాబాద్ వచ్చిన అసోం యువకుడు
- ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తూ జీవనం
- షాక్ కొట్టడంతో కాలిపోయిన చేతులు, చెవులు
పోలీసుల కథనం ప్రకారం.. అసోంకు చెందిన భాస్కర్ జ్యోతినాథ్ (20) రెండేళ్ల క్రితం హైదరాబాద్ వచ్చి ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తూ శంకర్‌పల్లిలో ఉంటున్నాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి విధుల నుంచి వచ్చిన తర్వాత అర్ధరాత్రి వేళ ఫోన్‌కు చార్జింగ్ పెట్టి మాట్లాడుతుండగా ఒక్కసారిగా షాక్ కొట్టింది. దీంతో చేతులు, చెవులు కాలిపోయాయి. వెంటనే స్నేహితులు అతడిని శంకర్‌ప్లలిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే అతడు మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.