Chiranjeevi: 'మిషన్ ఇంపాజిబుల్' ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా చిరంజీవి

Chiranjeevi will attend Mishan Impossible movie pre release event
షార్ట్స్‌లో చూడండి
ముగ్గురు బాలలు ప్రధాన పాత్రధారులు కాగా, తాప్సీ కీలక పాత్రలో నటించిన చిత్రం మిషన్ ఇంపాజిబుల్. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ రేపు (మార్చి 30) హైదరాబాదులో జరగనుంది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. హైదరాబాదు వెస్టిన్ హోటల్ లో రేపు సాయంత్రం 6 గంటల నుంచి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. 

కాగా, ఏజెంట్ శ్రీనివాస ఆత్రేయతో హిట్ కొట్టిన స్వరూప్ ఆర్ఎస్ జే ఈ సినిమాకు దర్శకుడు. అన్వేష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి నిర్మాతలు. మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంను పట్టుకుంటే డబ్బులు ఇస్తారన్న ఆలోచనతో ముగ్గురు చిన్నారులు ఏంచేశారన్నది ఈ చిత్ర కథాంశంగా తెలుస్తోంది. బాలనటులు రోషన్, జైతీర్థ, భానుప్రకాశ్ నటించిన 'మిషన్ ఇంపాజిబుల్' చిత్రం ఏప్రిల్ 1న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
Go Back to Shorts
Chiranjeevi
Mishan Impossible
Pre Release Event
Tollywood

More Telugu News