పురుషులతో సమానంగా మహిళా వరల్డ్ కప్ ప్రైజ్ మనీ... పరిశీలిస్తున్న ఐసీసీ
- పురుష, మహిళా వరల్డ్ కప్ ప్రైజ్ మనీలో భారీ వ్యత్యాసం
- 2019 పురుష వరల్డ్ కప్ విజేతకు రూ.28 కోట్లు
- ఈ ఏడాది మహిళల వరల్డ్ కప్ విజేతకు రూ.10 కోట్లు
- దీనిపై చర్చిస్తామన్న ఐసీసీ సీఈవో
ఈ భారీ వ్యత్యాసంపై విమర్శలు వస్తుండడం పట్ల ఐసీసీ స్పందించింది. పురుషులతో సమానంగా మహిళల వరల్డ్ కప్ ప్రైజ్ మనీ అందించడంపై మరింత విస్తృతంగా చర్చించాలని నిర్ణయించింది. వచ్చే 8 ఏళ్లకు సంబంధించిన ఐసీసీ మహిళా ఈవెంట్లలో అందించాల్సిన ప్రైజ్ మనీపై తప్పకుండా చర్చిస్తామని ఐసీసీ సీఈవో జెఫ్ అలార్డైస్ వెల్లడించారు.