Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రాజమౌళిని అన్ ఫాలో చేసిన అలియా భట్.. ఇన్స్టాలో 'ఆర్ఆర్ఆర్' పోస్టులు డిలీట్ చేసిన వైనం!

Alia Bhatt Unfollows SS Rajamouli
  • 'ఆర్ఆర్ఆర్'లో చాలా తక్కువ సమయం మాత్రమే కనిపించిన అలియా పాత్ర
  • స్క్రీన్ పై పెద్దగా స్పేస్ లేకపోయేసరికి అప్సెట్ అయిన అలియా
  • సినిమా హిట్ అయినా ఇంత వరకు స్పందించని వైనం
బాలీవుడ్ ముద్దుగుమ్మ అలియా భట్ 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో దక్షిణాది సినీపరిశ్రమలో అడుగుపెట్టింది. రాజమౌళి డైరెక్షన్ అనగానే రెండో ఆలోచన లేకుండా ఈ సినిమాకు అలియా ఓకే చెప్పేసింది. అయితే చివరకు ఆమెకు నిరాశ మాత్రమే మిగిలింది. సినిమాలో ఆమె పాత్ర చాలా తక్కువ సమయం మాత్రమే కనిపిస్తుంది.

ఎన్నో ఆశలతో ఈ ప్రాజెక్ట్ లోకి అడుగుపెట్టిన అలియాకు... స్క్రీన్ పై పెద్దగా స్పేస్ లేకపోయేసరికి షాక్ తగిలినట్టయిందట. దీంతో ఆమె తన ఇన్స్టాగ్రామ్ ఖాతా నుంచి రాజమౌళిని అన్ ఫాలో చేసినట్టు తెలుస్తోంది. అంతేకాదు, 'ఆర్ఆర్ఆర్' చిత్రానికి సంబంధించిన పలు పోస్టులను డిలీట్ చేసింది.  

'ఆర్ఆర్ఆర్' విడుదల వాయిదా పడకముందు నిర్వహించిన సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో అలియా చాలా ఉత్సాహంగా పాల్గొంది. అయితే విడుదల తేదీ ఖరారైన తర్వాత జరిగిన ప్రమోషన్ కార్యక్రమాల్లో మాత్రం ఏ మాత్రం యాక్టివ్ గా లేదు. అంతేకాదు సినిమా సూపర్ హిట్ అయినప్పటికీ... అలియా సోషల్ మీడియాలో ఒక్క పోస్ట్ కూడా పెట్టలేదు. 

మరోవైపు బాలీవుడ్ లో ఎంతో స్టార్ డమ్ ఉండే అలియాకు మంచి స్కోప్ ఉన్న క్యారెక్టర్ ఇస్తే బాగుండేదని ఆమె అభిమానులు అంటున్నారు. అలియా అప్సెట్ కావడంలో ఏ మాత్రం తప్పులేదని వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు, 'ఆర్ఆర్ఆర్' చిత్రం ఇప్పటికే రూ. 500 కోట్ల మార్కును దాటేసి దూసుకుపోతోంది.
Alia Bhatt
RRR
Rajamouli
Instagram
Unfollow

More Telugu News