Mahesh Babu: మహేశ్ తో రాజమౌళి సినిమా బడ్జెట్ అన్ని వందల కోట్లా!

Mahesh Babu and Rajamoui project update
షార్ట్స్‌లో చూడండి
రాజమౌళి తాజా చిత్రంగా థియేటర్లకు వచ్చిన 'ఆర్ ఆర్ ఆర్' సంచలన విజయాన్ని నమోదు చేసింది. విడుదలైన అన్ని ప్రాంతాల్లో వసూళ్ల వర్షాన్ని కురిపిస్తోంది. మూడు రోజుల్లో 500 కోట్ల రూపాయల మార్కును దాటేసింది. దాంతో ఆ తరువాత రాజమౌళి చేయనున్న సినిమా గురించి అంతా ఆసక్తికరంగా మాట్లాడుకోవడం మొదలైపోయింది.

ఈ సినిమా ఆఫ్రికా అడవుల నేపథ్యంలో నడుస్తుందని తాజాగా ఒక ఇంటర్వ్యూలో విజయేంద్ర ప్రసాద్ చెప్పారు. రాజమౌళికి లైన్ మాత్రమే చెప్పాననీ, త్వరలో పూర్తి కథను వినిపించనున్నానని అన్నారు. ఇక ఈ సినిమా మల్టీ స్టారర్ కాదనీ, హీరోగా మహేశ్ బాబు మాత్రమే కనిపిస్తాడని రీసెంట్ గా రాజమౌళి చెప్పిన సంగతి తెలిసిందే.

ఈ సందర్భంలోనే ఆయన ఈ ప్రాజెక్టు 'బాహుబలి' ..  'ఆర్ ఆర్ ఆర్' కంటే పెద్దది అన్నారు. దాంతో ఒక్కసారిగా అందరి దృష్టి ఆ వైపు మళ్లింది. ఇక ఇప్పుడు ఈ సినిమా కోసం 800 కోట్ల రూపాయల బడ్జెట్ అవుతుందనే ఒక అంచనాకి వచ్చినట్టుగా సమాచారం. ఈ సినిమాలో మహేశ్ బాబును ఆయన జేమ్స్ బాండ్ గా చూపించనున్నారని అంటున్నారు.
Go Back to Shorts
Mahesh Babu
K V Vijayendra Prasad
Rajamouli

More Telugu News