గడ్డం లేదా?.. అయితే, ఆఫీసులకు రావొద్దు: ఆఫ్ఘన్లో తాలిబన్ల కొత్త రూల్
- కాబూల్‌లో ప్రభుత్వ కార్యాలయాలను తనిఖీ చేసిన తాలిబన్లు
- గడ్డం గీసుకోవద్దంటూ హుకుం
- సంప్రదాయ దుస్తులనే ధరించాలని ఆదేశం
రాజధాని కాబూల్‌లోని పలు ప్రభుత్వ కార్యాలయాలను తాలిబన్ ప్రభుత్వంలోని పబ్లిక్ మొరాలిటీ మంత్రిత్వ శాఖకు చెందిన అధికారులు సోమవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఉద్యోగులకు డ్రెస్ కోడ్ తప్పనిసరి అని ప్రకటించారు. గడ్డం గీసుకోవద్దని చెప్పిన అధికారులు.. సంప్రదాయ దుస్తులనే ధరించాలని హుకుం జారీ చేశారు.