తెలంగాణలో తాజాగా 30 కరోనా పాజిటివ్ కేసులు
- గత 24 గంటల్లో 17,806 కరోనా పరీక్షలు
- హైదరాబాదులో 9 కొత్త కేసులు
- కరోనా నుంచి కోలుకున్న 51 మంది
- కరోనా మరణాలు నిల్
- ఇంకా 492 మందికి చికిత్స
రాష్ట్రంలో ఇప్పటివరకు 7,91,181 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 7,86,578 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 492 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో ఇప్పటిదాకా 4,111 మంది మరణించారు.

.