ఏపీలో తాజాగా 27 కరోనా పాజిటివ్ కేసులు
- గత 24 గంటల్లో 8,948 కరోనా పరీక్షలు
- అనంతపురం జిల్లాలో 11 కొత్త కేసులు
- 6 జిల్లాల్లో కొత్త కేసులు నిల్
- కరోనా నుంచి కోలుకున్న 55 మంది
- ఇంకా 367 మందికి చికిత్స
ఏపీలో ఇప్పటివరకు 23,19,475 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 23,04,378 మంది పూర్తిగా కోలుకున్నారు. ఇంకా 367 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా కరోనాతో 14,730 మంది మరణించారు.
.