ఐపీఎల్ లో నేడు రెండు మ్యాచ్ లు... తొలి మ్యాచ్ లో ఢిల్లీ వర్సెస్ ముంబయి

Delhi Capitals faces Mumbai Indians
  • ఐపీఎల్ లో సూపర్ సండే
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ
  • ముంబయి బ్రాబౌర్న్ స్టేడియంలో మ్యాచ్
  • రెండో మ్యాచ్ లో బెంగళూరు వర్సెస్ పంజాబ్
ఐపీఎల్ 15వ సీజన్ లో భాగంగా నేడు సూపర్ సండే నాడు రెండు మ్యాచ్ లు నిర్వహిస్తున్నారు. తొలి మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడుతుండగా... రెండో మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆడనుంది. ముంబయి, ఢిల్లీ మ్యాచ్ కు ముంబయిలోని బ్రాబౌర్న్ స్టేడియం ఆతిథ్యమిస్తోండగా, కొద్దిసేపటి కిత్రమే టాస్ నిర్వహించారు. టాస్ గెలిచిన ఢిల్లీ సారథి రిషబ్ పంత్ బౌలింగ్ ఎంచుకున్నాడు.

ఢిల్లీ జట్టు ఇదే...
రిషబ్ పంత్ (కెప్టెన్/వికెట్ కీపర్), పృథ్వీ షా, టిమ్ సీఫెర్ట్, మన్ దీప్ సింగ్, రోవ్ మాన్ పావెల్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, ఖలీల్ అహ్మద్, కుల్దీప్ యాదవ్, కమలేశ్ నాగర్ కోటి.

ముంబయి జట్టు ఇదే...
రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, అన్మోల్ ప్రీత్ సింగ్, కీరన్ పొలార్డ్, టిమ్ డేవిడ్, డేనియల్ శామ్స్, మురుగన్ అశ్విన్, టైమల్ మిల్స్, జస్ప్రీత్ బుమ్రా, బాసిల్ థంపి.
Go Back to Shorts
Delhi Capitals
Mumbai Indians
IPL
Brabourne
Mumbai

More Telugu News