అందుకే మేము ప్రయాణిస్తోన్న బస్సు బాకరాపేటలో లోయలో పడింది: పెళ్లి కొడుకు వేణు
- మెల్లిగా వెళ్లాలని డ్రైవర్‌కు చెప్పాం
- డ్రైవర్ వినిపించుకోకుండా వేగంగా బస్సు నడిపాడు
- ఎదురుగా వాహనాలు వస్తున్నప్పటికీ వేగంగా తీసుకెళ్లాడు
- బస్సు ఒక్కసారిగా లోయలో పడిపోయింది
ఆ తర్వాత తాము అందరం గాయాలపాలై స్పృహ కోల్పోయామని అన్నాడు. మళ్లీ మెలుకువ వచ్చే సరికి ఆసుపత్రిలో ఉన్నామని, తమను పోలీసులు ఇక్కడకు తీసుకొచ్చినట్లు తెలిసిందని చెప్పాడు. ప్రమాదానికి ముందు తాను బస్సులో వెనుక సీట్లో కూర్చొని ఉన్నానని చెప్పాడు. ఈ ప్రమాదంలో గాయపడ్డ వారు అందరూ తమ బంధువులు, మిత్రులేనని తెలిపాడు. మరో 20 నిమిషాల్లో తిరుపతికి చేరుకుంటామనగా బాకరాపేటలో ఈ ప్రమాదం చోటు చేసుకుందని వివరించాడు.