ఒకరి తప్పును ఇంకొకరు కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు: రేవంత్ రెడ్డి
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై రేవంత్ ఆగ్రహం
- కేంద్రం పెట్రోల్ ధరలు పెంచిందని విమర్శ
- రాష్ట్రం విద్యుత్ చార్జీలు పెంచిందని ఆగ్రహం
- జేబుదొంగల్లా మారాయని మండిపాటు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల్ని దోచుకుంటున్నాయని, పేదలకు సాయం అందించడం మానేసి ప్రభుత్వాలు జేబుదొంగల్లా మారాయని అన్నారు. ఎన్నికలు అయిపోగానే పెట్రోల్, డీజిల్ ధరలు పెంచారని వెల్లడించారు. రైతుల సమస్యలకు టీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు.