ఉక్రెయిన్ - రష్యా యుద్ధం ముగింపు.. మే 9!
- మే 9న రష్యాకు విజయోత్సవ దినం
- నాజీ జర్మనీపై విజయానికి గుర్తు
- అదే తేదీన యుద్ధాన్ని ముగించాలన్న ఆలోచన
- బయటపెట్టిన ఉక్రెయిన్ సైనిక వర్గాలు
అయితే మే 9న యుద్ధాన్ని ముగించాలన్నది రష్యా ఆలోచనగా ఉక్రెయిన్ సైన్యం చెబుతోంది. ఉక్రెయిన్ ఆర్మ్ డ్ ఫోర్సెస్ కు చెందిన విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ కీవ్ ఇండిపెండెంట్ ఓ నివేదికను ప్రచురించింది. దీని ప్రకారం.. యుద్ధం కచ్చితంగా మే 9న ముగియాలని రష్యా దళాలకు ఆదేశాలు వెళ్లినట్టు సమాచారం. నాజీ జర్మనీపై రష్యా విజయం సాధించిన రోజు అది. మే 9న విజయోత్సవంగా రష్యా జరుపుకుంటుంది. ఉక్రెయిన్ సైనిక వర్గాల అంచనాలు నిజమవుతాయా? లేదా ఈ లోపే యుద్ధం ముగిసిపోతుందా? అన్నది చూడాల్సిందే.