ఏపీలో కొత్త‌గా 31 కేసులు.. తాజా బులెటిన్ ఇదిగో

ap corona daily updates
షార్ట్స్‌లో చూడండి
ఏపీలో గడచిన 24 గంటల్లో కరోనా వ్యాప్తికి సంబంధించి తాజా బులెటిన్ కాసేప‌టి క్రితం విడుదలైంది. 10,372 కరోనా పరీక్షలు నిర్వహించగా, 31 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అనంత‌పురం జిల్లాలో అత్య‌ధికంగా 11 కేసులు న‌మోదు కాగా.. తూర్పు గోదావరి జిల్లాలో 5, గుంటూరు జిల్లాలో 4 కొత్త కేసులు నమోదయ్యాయి. క‌ర్నూలు, ప్ర‌కాశం, ప‌శ్చిమ గోదావ‌రి, విజ‌య‌న‌గ‌రం జిల్లాల్లో కొత్త కేసులేవీ నమోదు కాలేదు. 

అదే సమయంలో 66 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. కొత్తగా మరణాలేవీ సంభవించలేదు. ఏపీలో ఇప్పటివరకు 23,19,328 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 23,04,148 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 450 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటిదాకా కరోనాతో 14,730 మంది మరణించారు.
Go Back to Shorts
Corona Virus
Andhra Pradesh
Health Bulletin

More Telugu News