Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'ఆర్ఆర్ఆర్' ప్రేక్ష‌కుల‌కు వార్నింగ్‌.. ఈ థియేట‌ర్లో తెరవ‌ద్ద‌కు వ‌స్తే మేకులు దిగుతాయి.. ఫొటోలు ఇవిగో!

warning to rrr audience
  • స్టార్ హీరోల సినిమాలు విడుద‌ల‌య్యే స‌మ‌యంలో థియేట‌ర్ల‌లో ఫ్యాన్స్ హంగామా
  • ఇటీవ‌ల రాధేశ్యామ్ విడుద‌ల స‌మ‌యంలో తెర‌పై పాలాభిషేకం
  • విజయవాడలోని అన్నపూర్ణ థియేటర్‌లో తెర వ‌ద్ద మేకుల ఏర్పాటు
స్టార్ హీరోల సినిమాలు విడుద‌ల‌య్యే స‌మ‌యంలో థియేట‌ర్ల‌లో ఫ్యాన్స్ హంగామా మామూలుగా ఉండ‌దు. కొందరు ప్రేక్షకులు ఈల‌లు వేస్తూ, తెర వ‌ద్ద‌కు వెళ్లి డ్యాన్సులు చేస్తారు. ఆ స‌మ‌యంలో ఇత‌ర ప్రేక్ష‌కుల‌కు స‌రిగ్గా క‌న‌ప‌డ‌క‌పోవ‌డ‌మే కాకుండా ఎంతో ఇబ్బందిగా ఉంటుంది. అలాగే, తెర‌కు న‌ష్టం వాటిల్లే అవ‌కాశ‌మూ ఉంటుంది. విజయవాడలోని అన్నపూర్ణ థియేటర్‌లో ఇటీవల రాధేశ్యామ్ సినిమా విడుదల రోజున అభిమానులు హీరో కనిపించగానే తెరపైనే పాలాభిషేకం చేసి క‌ల‌క‌లం రేపారు. 
                             
దీంతో తెర‌కు మరకలు పడి అది పాడైంది. దీంతో తెరను రూ.15 లక్షలు పెట్టి ఆధునికీకరించాల్సి వ‌చ్చింది. ఇప్పుడు థియేట‌ర్ల తెర‌ల విష‌యంలో వాటి ఓన‌ర్ల‌కు మ‌రో భ‌యం ప‌ట్టుకుంది. ఎల్లుండి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. అన్న‌పూర్ణ థియేట‌ర్ లో తెర వ‌ద్ద‌ మేకులు కొట్టిన చెక్కలను అమ‌ర్చారు. తెరవ‌ద్ద‌కు వ‌స్తే అపాయం అని హెచ్చరిక బోర్టులు కూడా పెట్టారు.   

                 
RRR
Rajamouli
Ramcharan
Vijayawada

More Telugu News