YSRCP: పావ‌లా ప‌నికి రూపాయి పావ‌లా ప‌బ్లిసిటీ!.. టీడీపీపై పోల‌వ‌రం ఎమ్మెల్యే సెటైర్‌!

polavaram mla satires on tdp
షార్ట్స్‌లో చూడండి
ఏపీ అసెంబ్లీలో మంగ‌ళ‌వారం నాడు ప‌లు కీల‌క అంశాల‌పై చ‌ర్చ సాగింది. ఈ సంద‌ర్భంగా అధికార వైసీపీ, విప‌క్ష టీడీపీల మ‌ధ్య మాట‌ల యుద్ధం కూడా సాగింది. చివ‌ర‌కు స‌భ‌లో ఈల వేశారంటూ టీడీపీ సభ్యుల‌పై స‌స్పెన్ష‌న్ వేటు ప‌డిన త‌ర్వాత పోల‌వ‌రం ప్రాజెక్టుపై వైసీపీకి చెందిన స‌భ్యులు త‌మ‌దైన శైలిలో పంచ్‌లు సంధించారు. పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణం టీడీపీ పాల‌న వ‌ల్లే ఆల‌స్య‌మ‌వుతోంద‌ని ప్ర‌ధానంగా వైసీపీ ఆరోపించింది.

ఈ చ‌ర్చ‌లో పాలుపంచుకున్న సంద‌ర్భంగా ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా పోల‌వ‌రం ఎమ్మెల్యే తెల్లం బాల‌రాజు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఈ నియోక‌జ‌వ‌ర్గంలోనే పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. పోల‌వ‌రం ప్రాజెక్టు ప‌నుల్లో పావ‌లా ప‌ని చేసిన చంద్ర‌బాబు స‌ర్కారు.. దాని ప‌బ్లిసిటీకి మాత్రం రూపాయి పావ‌లా ఖ‌ర్చు పెట్టార‌ని సెటైర్ సంధించారు. పోలవ‌రం ప్రాజెక్టు ప‌ర్య‌ట‌న‌కు ప‌లుమార్లు వెళ్లిన చంద్రబాబు ఏనాడూ నిర్వాసితుల వ‌ద్ద‌కు వెళ్ల‌లేద‌న్న బాల‌రాజు.. జ‌గ‌న్ మాత్రం నిర్వాసితుల‌తో మాట్లాడుతూనే ఉన్నార‌ని చెప్పారు.
Go Back to Shorts
YSRCP
AP Assembly Session
Polavaram Project
Tellam Balaraju

More Telugu News