పాకిస్థాన్‌లో దారుణ ఘ‌ట‌న‌.. 18 ఏళ్ల‌ హిందూ అమ్మాయి కాల్చివేత!

hindu girl shot dead in pak
పాకిస్థాన్ లో ఓ హిందూ అమ్మాయిని దుండ‌గులు కాల్చి చంపారు. దక్షిణ సింధ్ ప్రావిన్స్‌లో రోహి పట్టణం, సుక్కూర్‌లో ఈ దారుణ ఘ‌ట‌న చోటు చేసుకుంది. పాక్‌లో హిందూ యువ‌తుల‌ను అప‌హ‌రించ‌డం, ముస్లిం యువ‌కుల‌తో పెళ్లి చేయ‌డం, అనంత‌రం మ‌త మార్పిళ్ల‌కు పాల్ప‌డ‌డం వంటి ఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటున్నాయి. 

ఇందులో భాగంగానే 18 ఏళ్ల ఓ హిందూ అమ్మాయిని దుండ‌గులు అపహరించ‌డానికి ప్ర‌య‌త్నించారు. ఆ యువ‌తి ప్ర‌తిఘ‌టించ‌డంతోనే ఆమెపై దుండగులు కాల్పులు జ‌రిపిన‌ట్లు తెలుస్తోంది. కాగా, 2013- 2019 మధ్య 156 బలవంతపు మతమార్పిళ్ల ఘ‌టనలు చోటు చేసుకున్నాయ‌ని పీపుల్స్ కమిషన్ సెంటర్ ఫర్ సోషల్ జస్టిస్ ఓ నివేదిక‌లో పేర్కొంది. 

కాగా, పాక్‌లో హిందువుల జనాభా 1.60 శాతంగా ఉండ‌గా, వారి మొత్తం జ‌నాభాలో సింధ్ ప్రాంతంలో అత్యధికంగా 6.51 శాతం మంది ఉన్నారు. వారికి మ‌తవాదుల నుంచి త‌రుచూ వేధింపులు ఎదుర‌వుతున్నాయి.
Go Back to Shorts
Pakistan
India

More Telugu News