అంతా విధిరాత: 'రాధేశ్యామ్' సినిమాపై పూజ హెగ్డే కామెంట్

Pooja Hegde comments on Radhe Shyam failure
  • సినిమా హిట్ కావడం మన చేతుల్లో లేదు
  • సినిమా ఏమవుతుందనేది ముందుగానే రాసిపెట్టి ఉంటుంది
  • బాక్సాఫీస్ వద్ద సినిమా తలరాత మారిపోతుందన్న పూజ 
ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన 'రాధేశ్యామ్' అంచనాలను అందుకోవడంలో విఫలమయింది. తొలి మూడు రోజులు భారీ వసూళ్లను రాబట్టినా... నాలుగో రోజు నుంచి డీలా పడింది. హిందీలో అయితే ఈ సినిమా పరిస్థితి దారుణంగా ఉంది. 

ఈ నేపథ్యంలో ఈ సినిమా గురించి పూజా హెగ్డే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, సినిమా హిట్ కావడం మన చేతుల్లో లేదని చెప్పింది. కొన్ని సినిమాలు యావరేజ్ గా ఉన్నా కలెక్షన్లు మాత్రం ఓ రేంజ్ లో ఉంటాయని చెప్పింది. మరికొన్ని సినిమాలు అద్భుతంగా ఉన్నా ఫలితం అనుకున్నట్టుగా రాకపోవచ్చని తెలిపింది. 

సినిమా ఏమవుతుందనే విషయం మన చేతుల్లో లేదని... అది ముందుగానే రాసిపెట్టి ఉంటుందని చెప్పింది. 'రాధేశ్యామ్' విషయంలో కూడా అదే జరిగిందని తెలిపింది. బాక్సాఫీస్ వద్ద సినిమా తలరాత మారిపోతుందనే విషయాన్ని తాను బలంగా నమ్ముతానని చెప్పింది. అంతా విధిరాత అని వ్యాఖ్యానించింది.
Go Back to Shorts
Pooja Hegde
Prabhas
Radhe Shyam
Bollywood
Tollywood

More Telugu News