ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత ప్రియురాలిని పెళ్లాడిన టిమ్ సౌథీ
- ప్రియురాలు బ్రయాను పెళ్లి చేసుకున్న క్రికెటర్ సౌథీ
- చాలా ఏళ్లుగా లివింగ్ రిలేషన్ షిప్ లో ఉన్న జంట
- ఐపీఎల్ లో కేకేఆర్ కు ఆడుతున్న సౌథీ
న్యూజిలాండ్ తరపున 85 టెస్టు మ్యాచులు ఆడిన సౌథీ 338 వికెట్లు పడగొట్టాడు. బ్యాటింగ్ లో కూడా రాణించి 5 హాఫ్ సెంచరీలతో 1,769 పరుగులు చేశాడు. ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్ కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడాడు. ఇటీవల జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు సౌథీని రూ. 1.5 కోట్లకు సొంతం చేసుకుంది.