హోలీ పండుగ రోజు భార్య మాంసం వండలేదట.. డయల్ 100కు ఫోన్ చేసి ఫిర్యాదు
- నల్గొండ జిల్లా చర్లగౌరారంలో ఘటన
- డయల్ 100కు ఆరుసార్లు ఫోన్ చేసిన వ్యక్తి
- సమయం వృథా చేశాడంటూ కేసు
విషయం ఏంటని ఆరా తీయగా పండగ రోజు తన భార్య మాంసం వండి పెట్టలేదని మద్యం మత్తులో తీరిగ్గా చెప్పాడు. అతడు చెప్పింది విన్న పోలీసులు షాకయ్యారు. ఆ తర్వాత తేరుకుని నవీన్‌ను హెచ్చరించారు. పోలీసుల సమయాన్ని వృథా చేసినందుకు అతడిపై కేసు నమోదు చేశారు. డయల్ 100ను ఆపద సమయాల్లో మాత్రమే ఉపయోగించాలని, అనవసరంగా ఫోన్ చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.