Sri Lanka: ఆసియా కప్ టీ20 టోర్నమెంట్ కు శ్రీలంక ఆతిథ్యం
- ఆగస్టు 27 నుంచి ఆసియా కప్
- శ్రీలంకలోని వివిధ వేదికల్లో మ్యాచ్ లు
- ఐదు టెస్టు జట్లు, ఒక క్వాలిఫయర్ జట్టుతో టోర్నీ
- క్వాలిఫయర్ కోసం అర్హత పోటీలు
ఈ ఏడాది ఆసియా కప్ టీ20 టోర్నీకి శ్రీలంక ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ టోర్నమెంట్ ఆగస్టు 27 నుంచి సెప్టెంబరు 11 వరకు శ్రీలంకలోని వివిధ వేదికల్లో జరగనున్నాయి. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆసియా ఖండంలోని ఐదు టెస్టు హోదా గల జట్లు భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ ఈ టోర్నీలో తలపడనున్నాయి. వీటితో పాటు మరో చిన్న జట్టుకు కూడా అవకాశం ఇవ్వనున్నారు. అది ఏ జట్టు అన్నది అర్హత పోటీల ద్వారా నిర్ణయిస్తారు. ఈ క్వాలిఫయర్ ను నిర్ణయించే టోర్నీ ఆగస్టు 20 నుంచి జరగనుంది.