యాక్సిడెంట్ లో నటి గాయత్రి మృతి

Actress Gayatri died in road accident
  • నిన్న రాత్రి రోహిత్ అనే వ్యక్తితో వెళ్తుండగా ప్రమాదం
  • ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందిన రోడ్డు పక్కనున్న మహిళ
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గాయత్రి మృతి
యూట్యూబర్, జూనియర్ ఆర్టిస్ట్ డాలీ రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. వివరాల్లోకి వెళ్తే.. డాలి అసలు పేరు గాయత్రి. నిన్న రాత్రి రోహిత్ అనే వ్యక్తితో కలిసి కారులో స్పీడుగా వెళ్తుండగా గచ్చిబౌలి వద్ద కారు అదుపు తప్పింది. ఈ క్రమంలో రోడ్డు పక్కన ఉన్న మహిళపైకి కారు దూసుకుపోయి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో సదరు మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. 

మరోవైపు ఈ ప్రమాదంలో గాయత్రి, రోహిత్ ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. వీరిద్దరినీ వెంటనే ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గాయత్రి ఆసుపత్రిలోనే కన్నుమూశారు. రోహిత్ పరిస్థితి విషమంగా ఉంది. మరోవైపు ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేశారు.  

గత కొంత కాలంగా గాయత్రి, రోహిత్ సన్నిహితంగా ఉంటున్నట్టు తెలుస్తోంది. హోలీ పండుగ సందర్భంగా గాయత్రి ఇంటికి వెళ్లి రోహిత్ పికప్ చేసుకున్నాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ప్రిజం పబ్ లో పార్టీ చేసుకున్నారు. పార్టీ అనంతరం ఇద్దరూ ఇంటికి బయల్దేరిన తర్వాత ప్రమాదం జరిగింది. అతి వేగమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు.
Go Back to Shorts
Gayatri
Dolly
Youtuber
Tollywood
Road Accident
dead

More Telugu News