బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం... కోస్తాంధ్రకు వర్షసూచన

Low Pressure area in Bay of Bengal
అండమాన్ తీరం వద్ద ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడినట్టు వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది రేపటిలోగా పూర్తిస్థాయిలో అల్పపీడనంగా మారుతుందని వెల్లడించింది. ఆపై క్రమంగా బలపడి బంగ్లాదేశ్, మయన్మార్ దిశగా వెళుతుందని వివరించింది. 

దీని ప్రభావంతో కోస్తాంధ్ర, ఒడిశా తీర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
Go Back to Shorts
Low Pressure
Bay of Bengal
Rains
Andhra Pradesh
Odisha

More Telugu News