CPI Ramakrishna: అధికారంలోకి వచ్చిన తర్వాత సొంత బ్రాండ్లు అమ్ముకుంటున్న ఒకే ఒక్కడు సీఎం జగన్: సీపీఐ రామకృష్ణ

CPI Ramakrishna comments on CM Jagan
షార్ట్స్‌లో చూడండి
జంగారెడ్డిగూడెం మరణాలపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శనాత్మకంగా స్పందించారు. నాటుసారా తాగి 25 మంది చనిపోతే సీఎం సహజ మరణాలంటున్నారని వ్యాఖ్యానించారు. నాటుసారా మృతుల కుటుంబాలను సీఎం వెంటనే పరామర్శించాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత సొంత బ్రాండ్లు అమ్ముతున్న ఒకే ఒక్కడు జగన్ అని విమర్శించారు. జగన్ తన సొంత బ్రాండ్ల ద్వారా ఇప్పటివరకు రూ.10 వేల కోట్లు రాబట్టారని ఆరోపించారు. 

బీజేపీ రోడ్ మ్యాప్ లో జగన్ ఇప్పటికే నడుస్తున్నారని రామకృష్ణ స్పష్టం చేశారు. పవన్ కల్యాణే త్వరలో వాస్తవాలు తెలుసుకుంటారని వ్యాఖ్యానించారు. బీజేపీకి, జనసేనకు మధ్య త్వరలోనే తెగదెంపులు జరుగుతాయని అన్నారు. బీజేపీ, వైసీపీలకు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో పవన్ కలిసి వస్తారని పేర్కొన్నారు.
Go Back to Shorts
CPI Ramakrishna
CM Jagan
Jangareddy Gudem
Deaths
Pawan Kalyan
BJP
YSRCP
Andhra Pradesh

More Telugu News