సొంత పార్టీ నేతలకే పాక్ ప్రభుత్వం నుంచి కిడ్నాప్ బెదిరింపులు.. తలదాచుకున్న దిగువ సభ సభ్యులు
- సింధ్ హౌస్ లో తలదాచుకున్న వైనం
- ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేసేందుకు 24 మంది సిద్ధం
- మంత్రులు బెదిరింపులకు దిగుతున్నారంటూ ఆందోళన
అయితే, వారిని కిడ్నాప్ చేస్తామంటూ ప్రభుత్వం నుంచే బెదిరింపులు వస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో వారంతా ఇప్పుడు.. ముఖ్యమైన అధికారులు బస చేయడం కోసం కట్టిన సింధ్ హౌస్ లో తలదాచుకున్నట్టు తెలుస్తోంది. కిడ్నాప్ చేస్తామంటూ మంత్రులు తమను బెదిరిస్తున్నారని, అందుకే తాము ఇలా సింధ్ హౌస్ లో తలదాచుకుంటున్నామని ఆ 24 మంది ఎంఎన్ఏలు చెప్పారు.
మరికొందరు మంత్రులు కూడా వచ్చేందుకు సిద్ధమైనా ప్రతిపక్షాలు వారికి వసతి సౌకర్యాలు ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా లేవని చెప్పారు. అయితే, సింధ్ హౌస్ ను నేతల కొనుగోళ్లకు కేంద్రం కాకుండా ఉండేందుకు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చర్యలు చేపట్టారు. అయినా, కూడా సొంత పార్టీ నేతలే అందులోకి వెళ్లి తలదాచుకుంటున్నారు.